29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ధాన్యం కొనుగోళ్ళకు ఏర్పాట్లు పూర్తి

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : రబీ సీజన్ లో  ధాన్యం సేకరణకు 446 కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు కొనుగోలు కేంద్రాల పట్ల  ప్రత్యేక దృష్టి పెట్టాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయం నందు  బుధవారం రోజున  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ రానున్న యాసంగి సీజన్ లో 26 వేల ఎకరాల వరి పంట సాగు చేసినందున సుమారుగా 6.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాలకు 5.63టన్నుల ధాన్యం రానున్నదని అంచనా వేశారు. అలాగే ప్రభుత్వ అధికారులు పూర్తి సమన్వయంతో పని చేస్తూ కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలనీ అయన కోరారు.  ధాన్యం వచ్చిన ప్రాంతాలలో  వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచనలు చేశారు. అదే విధంగా అకాల వర్షాలను దృష్టి లో ఉంచుకొని కేంద్రాలలో తగినన్ని టార్పాలిన్ లను ఏర్పాటు చేయాలనీ మార్కెటింగ్ శాఖ వారికి సూచించారు. ప్రతి కేంద్రం లో రైతులకు త్రాగునీరు, ఓఅర్ ఎస్ ప్యాకేట్స్, ఎండా తీవ్రతకు తగిన టెంట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సరిపడా తేమ యంత్రాలు, ప్యాడి క్లినర్స్ అందజేయాలని కోరారు. జిల్లాకు కేటాయించిన  ప్యాడి క్లినర్స్ ను సద్వినియోగం చేసుకోవాలని అలాగే  గోనె సంచులు అందుబాటులో ఉంచాలని అన్నారు. రైతుల నుండి సేకరించిన ధాన్యానికి  క్వింటాలు కు కనీస  మద్దతు ధర గ్రేడ్-ఏ రకానికి గాను రూ.2,320/-, కామన్ రకానికి రూ. 2,300/- మరియు సన్న రకం వడ్లకు చెల్లించాల్సిన 500/- బోనస్  కొరకు రైతులు తమ ధాన్యం వివరములను ట్యాబ్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని 24 గంటలలో వారి  బ్యాంక్ ఖాతాలలో డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలను పరిష్కరించాడానికి జిల్లా కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 08468-220051 ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశం లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, డి సి ఎస్.ఓ మల్లిఖార్జున బాబు, జిల్లా వ్యవసాయ  అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారిణి రమ్య, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శ్రీనివాస్ మరియు సంబందిత అధికారులు పాల్గొన్నారు.

Arrangements for grain procurement completed

More articles

Latest article