బతుకమ్మ,మెండోరా: ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి రాజారాం అనే వ్యక్తి గల్లంతయినట్లు ఎస్ఐ నారాయణ తెలిపారు. మెండోరా ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం సమీపంలోని కాకతీయ కాలువలో కాలకృత్యాల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో జారిపడిన మారుతి కోసం వెతకడానికి రాజారాం, అవినాష్ ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ పై వెళ్లి వాహనం అదుపు తప్పి కెనాల్ లో పడిపోయిన అవినాష్ బతికి బయటపడ్డాడని రాజారం భార్య సోనాబాయ్ ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్సై పేర్కొన్నారు.