25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

తీవ్రవాద సంస్థలకు తగిన బుద్ధి చెప్పాలి

Must read

📰 Generate e-Paper Clip

  • వాకర్స్ యోగ అసోసియేషన్ తిలక్ గార్డెన్ అధ్యక్ష కార్యదర్శులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తీవ్రవాద సంస్థలకు తగిన బుద్ధి చెప్పాలని వాకర్స్ యోగ అసోసియేషన్ తిలక్ గార్డెన్ అధ్యక్ష కార్యదర్శులు అన్నారు.  భారత దేశంలో పర్యటక కేంద్రంగా ఉన్న జమ్ము కాశ్మీర్లో  పర్యాటకులపై ఉగ్రవాదులు తరుపున కాల్పులకు నిరసనగా నిజామాబాద్ వాకర్స్ యోగ  అసోసియేషన్ ఆఫ్ తిలక్ గార్డెన్ అధ్యక్ష కార్యదర్శులు టి గంగాధర్ ఎడ్ల ధనరాజ్  నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎంతో స్వచ్ఛంగా బతుకుతున్న ప్రజలను ఇబ్బంది పెడుతున్న తీవ్రవాద సంస్థలపై భారత దేశ పౌరులు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. చేతగానితనంగా అమాయకులైన  పర్యాటకులపై ఇలా దాడిలు జరపడం సరైన పద్ధతి కాదని వారన్నారు. తీవ్రవాదులు హిందువు ప్రజలను టార్గెట్ చేసుకొని ఇలా కాల్పులు జరపడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. తీవ్రవాదులు ముస్లిం అయితే అదే జమ్ము కాశ్మీర్లో నివసిస్తున్న ముస్లిం సోదరులు హిందూ పర్యాటకులను ఒక మానవ దృక్పథంతో రక్షించడం తోపాటు వారికి వారి వారి ఇంట్లో ఆశ్రయించడం ఎంత గొప్ప విషయమని అన్నారు. ఇతర దేశాలలో ఉన్న ముస్లిం తీవ్రవాద సంస్థలు మాత్రమే ఇలాంటి పిరికితనానికి పాల్పడతారని, మా భారతదేశంలోని ముస్లిం సోదరులు సోదరీమణులు అన్నదమ్ముల అక్కచెల్లెలుగా సుఖ సంతోషాలతో జీవనాన్ని కొనసాగిస్తారని తెలిపారు. అంతకుముందు జమ్ము కాశ్మీర్లో మృతి చెందిన పర్యాటకుల ఆత్మకు శాంతి చెందాలని రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ యోగ  అసోసియేషన్ ఆఫ్ తిలక్ గార్డెన్ కోశాధికారి పెంటన్న, దయానంద్, కిష్టన్న, మదన్, మోతిలాల్, రమేష్, సాయన్న, విజయ్ కుమార్, కుసురుస్ హందన్ భాయ్, రావుపోద్దిన్, ముంతాజ్ ఆఫ్టర్, విశ్వనాథ్, శంకర్, నాగోజి, సుధాకర్, ఆకాష్, గంగాధర్, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.

More articles

Latest article