27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

  • వాడవాడల్లో ఏరియా జెండాలను ఎగరేయాలి
  • టియుసిఐ జిల్లా కార్యదర్శి ఆర్.రమేష్

 

సిరికొండ, బతుకమ్మ :  మే డే పోరాట స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక చట్టాలను త్రిప్పికొట్టాలని, 139 వ మే డేను పురస్కరించుకొని వాడ వాడల్లో ఎర్ర జండాలను ఎగరవేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ)జిల్లా కార్యదర్శి ఆర్. రమేష్ కార్మిక లోకానికి పిలుపును ఇచ్చారు. శుక్రవారం సిరికొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులతో కలిసి  మేడే పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు 1886లో కార్మిక లోకం పోరాడి సాదించుకున్న హక్కులను నేడు పాలక వర్గాలు రద్దుచేసి కార్మికలను బలిపశువులను చేశాయన్నారు. యాంత్రికరణతో శ్రామికుడు 8 గంటలకు బదులు నాలుగు గంటలు చేసినా సరిపోతుందని, పెట్టుబడుదారుడు కార్మికుల రక్త మాంసం పీల్చడానికి 12 గంటల వరకు పనిచేపిస్తూ శ్రమ దోపిడి చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 15 చట్టాలను అడ్రస్ లేకుండా చేసిందన్నారు. మిగతా 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ ఆమోదించి అమలు చేయడం వలన కార్మికులను కట్టు బానిసలుగా చేయడం తప్ప మరొకటి కాదన్నారు. ఒకపక్క 15 లక్షల కోట్ల రాయితీలు పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు ప్రకటించి కార్మికులను విస్మరించి వారి పొట్ట కొడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను  ప్రైవేటు యజమాన్యానికి అప్పగిస్తూ  కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారన్నారు. కార్మిక వర్గం ప్రభుత్వాల  కార్మిక వ్యతిరేక విధానాలు అర్థం చేసుకొని ఇక పోరాటంలో మమేకమై  సమాజంలో సాధనకు కృషి చేయాలి  అన్నారు.  కార్మిక పోరాట దినం మేడేను గ్రామ గ్రామాల్లో ఎర్ర జెండాలు ఎగరవేసి ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్  ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్  జి సాయరెడ్డి బోర్రన్న బాల కిషన్ సుజాత సాయవ్వ రాజవ్వ  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article