. . . ఆందోళనకు దిగిన ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు
బోధన్, బతుకమ్మ :
బోధన్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం చైర్మన్ పద్మ శరత్‌రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఏజెండా అంశాలపై చర్చించకుండానే సమావేశాన్ని ఐదు నిమిషాల్లో ముగించడంపై ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు.ఇటీవల గణేష్ ఉత్సవాలకు ఖర్చు చేసిన రూ.16 లక్షల నిధుల వివరాలు వెల్లడించాలని, స్లాటర్‌హౌస్ పనులు ఎందుకు ప్రారంభించలేదో చెప్పాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. తమ వార్డుల సమస్యలను ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ ఇలియాస్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో అవినీతి పెరిగిందని ఆరోపించారు. బీజేపీ కౌన్సిలర్ బాలరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం కౌన్సిలర్లు కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న సీఐ వెంకటనారాయణ కౌన్సిలర్లను సముదాయించి కమిషనర్‌ను అక్కడి నుంచి పంపించారు.

