. . . ప్రజా పాలన పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మరో మారు మోసం చేస్తుంది..
. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ..
నిజాం నిరంకుష పాలనలో ఉన్న ఆ రోజుల్లో వారి రాక్షస పాలన చరమగీతం పాడేందుకు ఆరోజుల్లోనే నిజాం రజాకారులను తరిమికొట్టిన పుణ్యగడ్డ మన తెలంగాణ గడ్డ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తాపేర్కొన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పటేల్ 98 జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైనఅర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకపోగా ప్రజా పాలన పేరిట తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసే కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. భారతదేశనికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం సిద్దిస్తే తెలంగాణ మాత్రం హైదరాబాద్ సంస్థానంగా నిజాం నిరంకుశ నిర్భంధంలో ఉండేదని అన్నారు. ఆనాడు రజాకార్ల రాక్షస పాలనకు చరమగీతం పలికెందుకు బాంచన్ దొర అన్న చేతులు బందుకులు పట్టి నిజాంకు ఎదురు తిరిగిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షేక్ బంధాగి లాంటి వీరుల, వీరవనితల పోరాటాస్ఫూర్తితో స్వేచ్ఛ వాయువులతో ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు. తెలంగాణను భారతదేశంలో కలిపే విధంగా ఆనాటి ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ఎనలేనిది అన్నారు. కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గం ఇంచార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు న్యాలం రాజు, ఆకుల హేమలత, తదితరులు పాల్గొన్నారు.
