28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

Happy Public Administration Day

. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో  మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలను  అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా  రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పుర ప్రముఖులకు, అధికారులకు, అనధికారులకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రగతిని, సెప్టెంబర్  17 ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగించారు. నగర మేయర్ నీతూకిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి, రాష్ట్ర సహకార ఫెడరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, ట్రెయినీ కలెక్టర్ సంకేత్ కుమార్, అదనపు సీపీ కోటేశ్వరరావు, జెడ్పీ సీఈవో ఉషా, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

జెడ్పీలో..

ప్రజాపాలన దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  జిల్లా పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ హోదాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సీఈఓ ఉషా, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article