30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎల్లారెడ్డి ఎస్సీ బాలికల హాస్టల్ లో టేకు చెట్ల నరికివేత

Must read

📰 Generate e-Paper Clip

  • ‘బతుకమ్మ’ లో వచ్చిన కథనంపై అటవీ అదికారుల స్పందన
  • హాస్టల్లో అటవీ అధికారుల తనిఖీ
  • టేకు దుంగల సీజ్

Teak trees cut down in Yella Reddy SC girls hostel

ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి  పట్టణంలోని షెడ్యూల్డ్  కులాల బాలికల హాస్టల్ లో టేకు చెట్ల నరికివేతపై అటవీ అధికారులు స్పందించారు. ఆదివారం హాస్టల్ ఆవరణలో టేకు చెట్ల నరికివేతపై  ‘ బతుకమ్మ ’ లో వచ్చిన కథనం పై అధికారులు రంగంలోకి దిగారు. సాయంత్రం హాస్టల్ లో అటవీ అధికారులు అనురంజనీ, గోపాల్ ల అధ్వర్యంలో బీట్ ఆఫీసర్ రాజ్ కుమార్ లు పరిశీలించారు. హాస్టల్ ప్రాంగణంలో టేకు చెట్లను

Teak trees cut down in Yella Reddy SC girls hostel

కొట్టేయడం పై ఫారెస్ట్ శాఖ అధికారులు పంచనామా చేశారు. ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ప్రాంగణంలో అనుమతి లేకుండా నాలుగు టేకు చెట్లను నరికి ఆనవాళ్లను  లేకుండా టేకు చెట్లు మొదళ్లను తగలబెట్టినట్లు గుర్తించారు. హాస్టల్ వెనుక భాగంలో సుమారు 16 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న నాలుగు టేకు చెట్లను అసంపూర్ణంగా నరికి దుంగలు, కొమ్మలను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. ఈ చర్యలు చెట్ల పునరుద్భవాన్ని నిరోధించేందుకు వాటిని కాల్చడం ద్వారా మరుగున పెట్టాలని ప్రయత్నించినట్టు ఫారెస్ట్

Teak trees cut down in Yella Reddy SC girls hostel

అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా హాస్టల్ ప్రాంగణంలో తరలించడానికి సిద్ధంగా ఉన్న 22 టేకు దుంగలను సీజ్ చేశారు. ఫారెస్ట్ యాక్ట్ 1927 ప్రకారం సీజ్ టేకు దుంగలను సీజ్ చేశారు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ యాక్ట్ ప్రకారం హాస్టల్ వార్డెన్ చెట్ల పరిరక్షణపై బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. అనధికారంగా చెట్లను నరికివేత వంటి చర్యలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, పర్యావరణ సంరక్షణలో ప్రజలు సహకరించాలని అటవీ అధికారిని అనురంజని కోరారు.

Teak trees cut down in Yella Reddy SC girls hostel

More articles

Latest article