- జేసీఐ ఇండియా అలుమ్ని జాతీయ వైస్ చైర్మన్ జైకుమార్ చేత ప్రశంసా పత్రం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జేసీఐ ఇండియా అలుమ్ని జాతీయ వైస్ చైర్మన్ జైకుమార్ అధికార పర్యటన లో భాగంగా జోన్ 12వ సమావేశం హైదరాబాద్ లో ఒక హోటల్ లో నిర్వహించారు. 2025 కార్యక్రమాల వివరాలు,తదిర అంశాలపైన సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి జాతీయ వైస్ చైర్మన్ జైకుమార్ ప్రశంసా పత్రాలు అందచేశారు. జిల్కార్ విజయానంద్ కు ఉత్తమ వైస్ చైర్మన్ గా ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో జోన్ చైర్మన్ డీవీఎస్ పీ గుప్తా,జాతీయ,జోన్ అధికారులు మనోజ్ , వినయ్ మెహతా,ప్రశాంత్,నవీన్ చావ్లా, శ్యాంసుందర్, శ్రీనివాస్ ,రాధాకృష్ణ,విశాఖ మాశంకర్,మాజెట్టి నవీన్ సభ్యులు పాల్గొన్నారు.
