వ్యాయామంతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు

0 1,737

. . .ఐఎంఏ అధ్యక్షుడు డా.దామోదర్ రావు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

ప్రతి రోజూ వ్యాయామం, యోగా, ప్రాణామయం చేయడం తో పాటు జీవన శైలి విధానంలో మార్పు చేసుకుంటే మానసిక ఒత్తిడి, షుగర్ వ్యాధిని నివారించవచ్చని ఐఎంఏ అధ్యక్షుడు డా.దామోదర్ రావు అన్నారు. ఐఎంఏ నిజమాబాద్ , భారతియ పిల్లల వైద్యుల సంఘం వారి సంయక్త అధ్వర్యంలో గురువారం నగరంలోని వేర్వేరు ప్రాంతాలలో ఉదయం మారుతి నగర్ స్నేహ సొసైటీ భవనంలో, భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని , ఖలీల్ బాడీలోని సన్ రైస్ ఆసుపత్రిలో ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం పురస్కరించుకొని రోగులకు వైద్యులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు దామోదర్ రావు షుగర్ వ్యాధి పై పేషెంట్లుకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డా.దామోదర్ రావు, ఐఏపీజిల్లా ప్రధాన కార్యదర్శి నేతిప్రధాన కార్యదర్శి డా. కె. శ్రీశైలం, ఐఏపీ ప్రధాన కార్యదర్శి డా. నేతి బాలెష్ మాట్లాడుతూ షుగర్ వ్యాధి గురించి ఎవరు కూడా భయపడ వలసిన అవసరం లేదని, వ్యాధి వచ్చాక వైద్యుని పర్యవేక్షణ లో చికిత్స తీసుకొని వ్యాధిని అదుపులో ఉంచు కోవాలని అన్నారు. ప్రజలు తీసుకొనే ఆహారంలో జంక్ పుడ్ కాకుండా ఆరోగ్య కరమైన ఆహారాన్ని సరైన సమయంలో తీసుకుంటే ఈ వ్యాధిని నయం చేయవచ్చునని అన్నారుఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డా.దామోదర్ రావు, ప్రధాన కార్యదర్శి డా. కె. శ్రీశైలం, ఐఎపీ నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి డా. నేతి బాలెష్, కొశాదికారి డా. రాజేంద్ర ప్రసాద్, డా. అజ్జ శ్రీనివాస్, డా. వినోద్ కుమార్ గుప్తా, డా. వినయ కుమార్, డా. రాఘవేంద్ర, డా. గాంధీ, డా. గోపి కృష్ణ, డా. శ్రీధర్ రావు, డా. అర్చన, స్నేహ సొసైటీ కార్యదర్శి . సిద్దయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, సిబ్బంది, 275 మంది విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.