23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

జాతీయస్థాయిలో ప్రశంసలందుకున్న ఏర్గట్ల విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ , ఏర్గట్ల: కాసుల చిత్రకళ అకాడమీ హైదరాబాద్ వ్యవస్థా పకురాలు  పద్మావతి ఆధ్వర్యంలో రామాయణానికి సంబంధించిన అంశాలతో కూడిన జాతీయస్థాయి చిత్రలేఖన పోటీలను గత జూలై, ఆగస్టు నెలలో నిర్వహించారు. ఈ పోటీలలో ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 17 మంది విద్యార్థులు రామాయణ ఇతివృత్తంగా చక్కని చిత్రాలు గీసి పోటీకి పంపించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చారి తెలిపారు.వారు వేసిన బొమ్మలకు జాతీయస్థాయిలో ఎంతో గుర్తింపు రావడం, ప్రశంసలందుకోవడం ఈ పాఠశాలకు గర్వకారణమని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించిన తెలుగు ఉపాధ్యాయులు ప్రవీణ్ శర్మ,గంగాధర్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునిరోద్దీన్,ప్రసాద్ పవన్, రాజ నర్సయ్య,శ్రీనివాస్,గంగమోహన్,విజయ్,నరేష్,ట్వింకిల్,సమత పాల్గొన్నారు.

More articles

Latest article