నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ విశ్వవిద్యాలయం అప్లైడ్ ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో “బహుళ పంటల సమ్మేళన వ్యూహం: ఏకపంట ఆధిపత్యం నుండి సమగ్ర వ్యవసాయ వ్యవస్థల వైపు మారడం” అనే అంశంపై ఒక రోజు విద్యార్థుల అవగాహన, చేరిక కార్యక్రమం (స్టూడెంట్ ఔట్రీచ్ ప్రోగ్రాం) బ్రోచర్ ను తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి టి.యాదగిరి రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విభాగాధిపతి డాక్టర్ స్వప్న మాట్లాడుతూ ఈ కార్యక్రమం బహుళ పంటల సమ్మేళనం ద్వారా రైతులు, వ్యవసాయ రంగ అభివృద్ధి ఎలా జరుగుతుందో విద్యార్థులు ప్రత్యక్షంగా అవగాహన పొందే అవకాశం ఏర్పడుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం ఆర్మూర్ మండలం గోవింద్ పేట గ్రామంలో ఏప్రిల్ 8 వ తేదీ 2026న నిర్వహించబడుతుందని ఆమె పేర్కొన్నారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎన్.స్వప్న, చైర్మన్ ప్రొఫెసర్ కె. రవీందర్ రెడ్డి, యూజీసీ సెల్ డైరెక్టర్, బిజినెస్ మేనేజ్మెంట్ ఆచార్య సిహెచ్ ఆంజనేయులు, డాక్టర్ పాత నాగరాజు డాక్టర్ టి సంపత్ పాల్గొన్నారు.
