30.9 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ వర్సిటీ ఇంటర్ కళాశాలల ఖో – ఖో జట్ల ఎంపికలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

తెలంగాణ యూనివర్సిటీ, యూనివర్సిటీ పరిధిలో ని డిగ్రీ , పి.జి, ప్రొఫెషనల్ కళాశాలల ఖో-ఖో (పురుషుల, మహిళల), ఎంపిక పోటీలను యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ లో ప్రారంభించామని వర్సిటీ డైరెక్టర్, స్పోర్ట్స్ డా. జి బాలకిషన్ తెలిపారు. ఈ క్రీడా ఎంపికలు ఉదయం 10. గం. ప్రారంభించామని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి తెలంగాణ యూనివర్సిటీ జట్టు గా సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఖో -ఖో టోర్నమెంట్ 2025-26,  దేవన్ గిరి యూనివర్సిటీ, కర్నాటక లో ఈ నెల 26 నుండి 31 వరకు పురుషులకు, ఏప్రిల్ 1 నుండి 4 వరకు మహిళలకు జరుగు టోర్నీలో సెలెక్ట్ అయిన ఖో – ఖో జట్లు పాల్గొంటారని, రెండు జట్లు చక్కని ప్రతిభను ప్రదర్శించి యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతులను పెంపొందించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించి, క్రీడా విభాగాన్ని, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టి.యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ జట్ల ఎంపికల నిర్వహణలో హాజరైన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్స్ ప్రవీణ్ కుమార్, రూప, అనూష , క్రీడాకారులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.బి.ఆర్ నేత, జూనియర్ అసిస్టెంట్ నరేష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article