27.2 C
Hyderabad

తెలంగాణ వర్సిటీలో ఎన్ఈపీ పై (ఆన్లైన్) ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం, ఆర్ & డి సెల్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ సహకారంతో “ఎన్ఈపీ ఓరియెంటెషన్ & సెన్సిటైజేషన్” అనే అంశంపై మార్చి 12 నుండి మార్చి20 వరకు ఆన్‌లైన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించబడుతుందని ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ డాక్టర్ శిరీష బోయపాటి, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 5.00 నుండి 8.15 గంటల వరకు జూమ్ ద్వారా కార్యక్రమం జరుగుతుందన్నారు. స్థాయిలో పాల్గొని అర్హత సాధించిన వారికి యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సీఏఎస్ కు పరిగణనలోకి వచ్చే ఈ-సర్టిఫికేట్ అందజేయబడుతుందన్నారు. ఆసక్తి గల అధ్యాపకులు, పరిశోధకులు https://mmc.ugc.ac.in లో నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు డా.షిరీష బోయపాటి (9848906357), డా. ఎం. సత్యనారాయణ (9177003066) ను సంప్రదించవచ్చని తెలిపారు.

More articles

Latest article