- జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ : రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి మండలంలోని గర్గుల్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలోని మౌలిక వసతులను, రోగులకు అందుతున్న సేవలను గురించి ఆరా తీశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనానికి విద్యుత్ సరఫరా గురించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటి వసతి కల్పన కల్పించుట గురించి కావలసిన ఏర్పాట్లు చేయాలని గ్రామ కార్యదర్శిని, మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ఆదేశించారు. రాత్రి వేళల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవన సముదాయ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసు వారిని ఆదేశించారు. రోగుల యొక్క ఔట్ పేషంట్ వివరాలు రోజువారీగా నివేదికలు రిజిస్టర్ లో అబ్స్ట్రాక్ట్ రూపంలో వ్రాసి పెట్టాలని సూచించారు. మౌలిక సదుపాయాల గురించి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. చంద్రశేఖర్, జిల్లా ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారి దోమకొండ డాక్టర్ ప్రభు దయా కిరణ్, మండల వైద్యాధికారి డాక్టర్ జోహార్, ఇతర వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

