27.2 C
Hyderabad

రిమ్స్ లో చిన్నారుల మరణాలు ప్రభుత్వ హత్యలే

The deaths of children at RIMS are state-sponsored killings

Must read

📰 Generate e-Paper Clip

 

. . . దత్తత తీసుకున్న జిల్లాలో చిన్నారులు చనిపోతే ముఖ్యమంత్రికి వచ్చే తీరిక లేదా?

. . . బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి

. . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

ఆదిలాబాద్, బతుకమ్మ :

ఆదిలాబాద్ రిమ్స్ లో జరిగిన ఘటన ప్రమాదవశాత్తు జరిగిన సంఘటననో, ప్రకృతి ప్రకోపం కారణంగానో జరగలేదని కేవలం ఈ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటనే అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదాన్ని, బాధితులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రిమ్స్ సంఘటన హృదయవిదాకరమైన సంఘటన అని, రోజులు కూడా నిండకముందే ఐదుగురు పసివాళ్లకు నిండు నూరేళ్లు నిండాయన్నారు. ఇదే మొదటి సంఘటన కాదు. ఈ హాస్పిటల్ లో గతేడాది 204 మంది, అంతకుముందు ఏడాది 174 మంది చిన్నారులు చనిపోయారన్నారు.ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ పరిస్థితులపై ప్రభుత్వం బేరీజు వేసుకోని చర్యలు తీసుకోవాలని,ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి హాస్పిటల్ కు వచ్చేందుకు సరైన రోడ్లు లేవన్నారు. ఏ రోజు పేపర్ చూసిన గర్బీణి మృతి, చిన్నారులు మృతి అనే వార్తలే ఉంటున్నాయని, ఈ పరిస్థితి గురించి వార్తలు రాసి, కథనాలు ప్రచురించి మీడియా వాళ్లే విసిగిపోయారన్నారు. 150 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట సగం మంది కూడా లేరని,నర్సులు సగం మందేనని, శానిటేషన్ సిబ్బంది 20 శాతం మాత్రమే ఉన్నారన్నారు. 150 ఏసీలు ఉంటే ఒక్క మెకానిక్ లేడని, ముగ్గురు ఎలక్ట్రీషియన్స్ మాత్రమే ఉన్నారని, ఆరోగ్యశ్రీ పథకం కింద 500 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయన్నారు. ఈ సంఘటనకు హాస్పిటల్ సిబ్బంది గానీ పేషెంట్లది గానీ తప్పు కాదని ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న జిల్లా పరిస్థితి ఇలా ఉంటుందా అని, ఐదు మంది పిల్లలు చనిపోతే వచ్చి చూసేందుకు తీరక లేదా అని ప్రశ్నించారు.  ఫుట్ బాల్ ఆడేందుకు, విదేశాల్లో తిరిగేందుకు ఈ ముఖ్యమంత్రికి సమయం ఉంటోందా అని మైనార్టీ, ఆదివాసీ పిల్లలు చనిపోతే చూసే టైమ్ కూాడా ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. హెల్త్ మినిస్టర్ వచ్చి ఇక్కడ కనీసం గంటన్నర కూడా లేరని, ఆయన వచ్చి కలెక్టర్ తో సమీక్ష నిర్వహించలేడని,ఎక్స్ కర్షన్ కు వచ్చినట్లు వచ్చి వెళ్లారన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులకు పరిహారం కాదు ఫైన్ కట్టాలని,ప్రతి కుటుంబానికి రూ. 50 లక్షలు ఇవ్వాలని, ప్రభుత్వం చేసిన తప్పునకు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు.ఒక్క రిమ్స్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ లో పరిస్థితులు బాగా లేవని,వరంగల్ ఎంజీఎంలో పై కప్పు కూలింది. నాగర్ కర్నూల్ లో ఎలుకలు కొరికి ఈసీజీ మెషీన్ పనిచేయటం లేదన్నారు. కచ్చితంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఫోరెన్సిక్ అడిట్ నిర్వహించాలని, రాష్ట్ర బడ్జెట్ లో హెల్త్ కోసం 10 శాతం బడ్జెట్ కేటాయిస్తామన్న ముఖ్యమంత్రి 5 శాతం మాత్రమే కేటాయిస్తున్నారని, దాంట్లో సగం జీతాలకే పోతుందని, ఇక మౌలిక సదుపాయాలకు ఆ నిధులు ఏం సరిపోతాయ్ అని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో శిశువులు, గర్భిణుల మరణాలు, వైద్య ఆరోగ్య సేవలపై మా పార్టీ తరపున అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, కమిటీ సమగ్ర అధ్యయనం చేసి పరిష్కారాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు.

More articles

Latest article