Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 August 2025, 4:52 pm Posted by : ramakrishna

రాయితీ యూరియాను పరిశ్రమల్లో వాడితే కఠిన చర్యలు

 

. . . జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

రాయితీ యూరియా పక్కదారి పట్టకుండా జిల్లా కేంద్రంలోని పలు పరిశ్రమలలో జిల్లా వ్యవసాయ అధికారి మేకల గోవిందు ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఇటీవల కొన్ని సొసైటీ ల నుంచి పరిశ్రమల నిర్వహకులు అడ్డదారిలో రాయితీ యూరియాను సేకరించి వినియోగిస్తున్న విషయం వెలుగు చూసింది. రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అదేశాల మేరకు యూరియా వినియోగించే పరిశ్రమలలో గురువారం జిల్లా వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Strict action will be taken against the use of subsidized urea in industries

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాయితీ యూరియాను వాడ దగా అనుమానాస్పద  పరిశ్రమను సందర్శించి తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలిపారు. రాయితీ యూరియాను వ్యవసాయ అవసరాల మేరకు వాడాలి, వ్యవసాయేతర పరిశ్రమలలో  వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి ఏఈఓ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు