31.2 C
Hyderabad

వరద బాధితులకు విరాళం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ: నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కళాకారులు వరద బాధితులకు ఆదివారం విరాళాలు సేకరించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్  కుడుముల సత్యనారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద బాధితులకు తమ వంతు సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరు మానవ దృక్పథంతో ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కళాకారుల సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సొంటెం సాయిలు, అన్యబోయిన శ్రీనివాస్, సొంటెం రాజలింగం యాదవ్ ,దేవరాజ్ వడ్ల వెంకన్న ,కత్తూరి కిషన్ ,శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article