అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలి

0 14,557
  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలో వినాయక శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ పట్టణంలో వినాయక శోభాయాత్ర రూట్ మ్యాప్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని వినాయక ఉత్సవ ఊరేగింపులో అప్రమత్తంగా ఉండి విద్యుత్ తీగలను ఉత్సవ విగ్రహాలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. కేబుల్ వైర్లను తొలగించి  రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి గణేష్ శోభ యాత్రలో ఎలాంటి  ఆటంకాలు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

Steps should be taken to prevent undesirable incidents from happening

Leave A Reply

Your email address will not be published.