కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్ధులకు స్టేట్ ర్యాంకులు

0 9,703

 

. . . ఐదుగురికి స్టేట్ ర్యాంకులు

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

పదో తరగతి పరీక్ష ఫలితాలలో నిజామాబాద్ కాకతీయ ఒలంపీయాడ్ స్కూల్ విద్యార్ధులకు స్టేట్ ర్యాంకులు దక్కాయి. బుదవారం వెలువడిన ఎస్ ఎస్ సీ రిజల్ట్ లో కాకతీయ ఒలంపీయాడ్ విద్యార్ధులు మారియా అరీష 589/600, సిహెచ్ వర్ష 588/600, బి శ్రీకర్ 585/600, జాహ్నవీ 583/600, కే అక్షర 583/600 మార్కులతో స్టేట్ ర్యాంకులు దక్కించుకున్నారు. ఈ సందర్బంగా పదో తరగతి ఫలితాలలో మంచి మార్కులు సాధించిన విధ్యార్ధులను పాఠశాల డైరెక్టర్ సిహెచ్ రామోజీరావు అభినంధించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ…కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో స్కూల్ స్థాయి నుండి ఐఐటి ఉండటం వలన ప్రణాళికా బద్దంగా ఉండటం వలన స్కూలు తరువాత ఇంటర్మీడియట్ లో జాతీయ స్థాయి ఐఐటి మెడికల్ పరీక్షలలో రాణిస్తు, అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారు అన్నారు. అందుకు 2025, 2026 ఐఐటి జేఈఈ మెయిన్స్ ఫలితాలే నిదర్శనమని ఈ రోజు విడుదలైన ఎస్ఎస్ సి  ఫలితాలలో స్టేట్ ఫస్ట్తో పాటు వివిధ స్టేట్ ర్యాంకులు సాధించిన కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులను అభినందించిన డైరక్టర్ సి.హెచ్.రామోజీ రావు తెలిపారు. ఇంటర్మిడియట్ లో ఆత్రుత పడితే జాతీయ స్థాయి ఐఐటి మెడికల్ పరీక్షలలో రాణించలేరని స్కూలు స్థాయి నుండే ఐఐటి ఫౌండేషన్ ఉదయం రెగ్యులర్ సిలబస్ తో పాటు మద్యాహ్నం ప్రతిరోజు ప్రతి సబ్జెక్టుని కాలేజి ఎంసెట్ స్థాయి లెక్చరర్ లతో శిక్షణ ఇప్పించడం వలనే ఉన్నతమైన ర్యాంకులు సాధించగలుగుతారు అని తెలిపారు. అందుకే విద్యార్థుల తల్లి దండ్రులు స్కూలు స్థాయిలోనే త్వరపడాలి. విద్యార్థుల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని డైరక్టర్ సి.హెచ్.తేజశ్విని తెలిపారు. అనుభవం ఉన్న అధ్యాపకులు  విద్యార్థులపై అను నిత్యం తమ పర్యవేక్షణ కలిగియున్న ఇన్ చార్జులు నాన్ టీచింగ్ సిబ్బంది  తల్లి దండ్రుల ప్రోత్సాహం  విశేష అనుభవం కలిగిన యాజమాన్యం ఇంతటి అద్భుతమైన విజయాలను సాధించిన కాకతీయ విద్యార్థినీ  విద్యార్థులందరికి శుభాకాంక్షలని కాకతీయ విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఎం.డి.ఫరీదుద్దిన్ తెలిపారు. ఇంతటి అద్భుతమైన ఫలితాలను కారకులైన కాకతీయ విద్యార్థనీ  విద్యార్థులకు శుభాకాంక్షలు. విశేషమైన కృషినందించిన ఉపాధ్యాయులకి  ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు  సిబ్బందికి చైర్ పర్సన్ సి.హెచ్.విజయలక్ష్మీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ కళాశాలల ప్రిన్సిపాల్స్ సందీప్ కులకర్ణి వి రణధీశ్ శర్మ  కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ ప్రిన్సిపాల్స్ నటరాజ్  చంద్రశేఖర్  సుచరిత  వైస్ ప్రిన్సిపల్స్ కవిత ఫనీంధర్ సిబ్బంది పాల్గొన్నారు.

 

State ranks for Kakatiya Olympiad School students

Leave A Reply

Your email address will not be published.