26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రజల దాహార్తిని తీర్చటంలో అంబలి కేంద్రాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడటంలో అంబలి కేంద్రాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు చల్లని, ఆరోగ్యకరమైన అంబలి అందించడం ఎంతో అవసరమని తెలిపారు. ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఈ సేవను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, యువ నాయకులు, వివిధ హోదాలలో ఉన్న నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Ambali Kendras play an important role in quenching the thirst of the people.

More articles

Latest article