26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి

Must read

📰 Generate e-Paper Clip

సిపిఎం జిల్లా కమిటి సభ్యుడు సురేష్ గొండ

జుక్కల్, బతుకమ్మ :- ఆరుగళం కస్టపడి పండించిన వరి ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం గత 20రోజుల క్రితం ప్రారంభించిన వరి కొనుగోలు కేంద్రాలన్నీ పేరుకు మాత్రమే మిగిలిపోయాయని, దీంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సి పి ఎం పార్టీ జిల్లా కమిటి సభ్యుడు సురేష్ గొండ ప్రభుత్వ తిరుపై మండిపడ్డారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు జుక్కల్ నియోజకవర్గం లొని కొన్ని గ్రామాల్లోని  వరి ధాన్యాన్ని రోడ్ల పై అరబెట్టి రాత్రి, పగలు వరి కుప్పల వద్ద కాపుకాస్తు దిన దిన గండంగా గడుపుతు ఆందోళన చెందు తున్నారని అన్నారు. రోడ్ల పై అరబెట్టిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు. గత వారం రోజులనుండి మేఘావృతమై ఉండడంతో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారని  అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకోని వెంటనే రైతుల శ్రేయస్సు కోరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, అనుకోని పరిస్థితి లో వర్షం పడితే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. కొనుగోలు కు కావాల్సిన బర్ధన్ సంచులను సరఫరా చేసి రైతులకు న్యాయం చెయ్యాలని లేని పక్షం లో వరి కి నష్టం వాట్టిళ్ళితే రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని అన్నారు.

More articles

Latest article