- ఆరబెట్టిన ధాన్యంలో 17 శాతం తేమ ఉండాలి
- ఏ గ్రేడ్ దొడ్డు, సన్న ధాన్యం ధర రూ. 2,320
- జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్
భీమ్ గల్, బతుకమ్మ : ఈ యేడు ప్రభుత్వం రైతులు పండించిన వరి సన్న రకం ధాన్యంకు కొనుగోలు కేంద్రాల్లో రూ. 2320 లకు కొనుగోలు చేసి అదనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ నిస్తోందని డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. మంగళవారం భీమ్ గల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని బాబాపూర్, బడా భీమ్ గల్,పల్లికొండ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ వరి దాన్యం దొడ్డు, సన్న రకాలు రూ. 2320 లకు కొనుగోలు చేయడం జరుగుతందని తెలిపారు. సన్నాలకు అదనంగా బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రైతులు వరి దాన్యాంను 17 శాతం లో తేమ వచ్చే వరకు ఆరా బెట్టాలని సూచించారు. సన్నలకు ప్రభుత్వం బోనస్ ఇస్తుందా అని రైతులు జె. సీ ని అడుగాగా, ముందుగా మీరిచ్చిన ధాన్యం కు సివిల్ సప్లై నుండి రూ. 2320 రూపాయల చొప్పున డబ్బులు వస్తాయని తర్వాత ప్రభుత్వం సపరేట్ గా రూ.500 బోనస్ ను రైతులకు అందిస్తుందని వివరించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో జె. సీ మాట్లాడుతూ సన్నలను, దొడ్డు రకం దాన్యం ను టాబ్ లో దేనిధి దానికి టాబ్ జాగ్రత్తగా ఎంట్రీ చెయ్యాలని, సన్న రకం దాన్యం బ్యాగ్ లపై సెంటర్ కోడ్ విదిగా వెయ్యాలని జె. సీ సూచించారు.జె. సి వెంట డీయర్ డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయగౌడ్, తహసీల్దార్ షబ్బీర్, ఏ. ఓ వంశీ కృష్ణ, ఏఈఓ భార్గవ్, ఐకేపీ ఏపీఎం రవీందర్, సెర్ఫ్ అధికారులు కుంట శ్రీనివాస్, పురస్తు నరేష్, రఘుపతి, సాయిలు, కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ బోదిరే స్వామి, డీసీసీ సెక్రటరీ కుంట రమేష్, ఎస్టీ సెల్ మండల్ ప్రెసిడెంట్ బాధవత్ గోపాల్ నాయక్, కానిస్టెన్సీ యూత్ కాంగ్రెస్ నాయకులు నాగేంద్ర, ఏ ఎం సీ కమ్మర్ పల్లి డైరెక్టర్ చిన్నరెడ్డి, మురళి, జుబేర్, వి. ఓ లావణ్య తదితరులు ఉన్నారు.
