- మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్
ఎల్లారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి కులగనన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడానికి స్వాగతిస్తున్నామని, రాష్ట్ర చరిత్రలోనే కుల గణన సువర్ణ అధ్యాయనమని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1931 వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన కులగణన చివరిదని ఇటీవల బీహార్ ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాలపై చేపట్టారని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ముందుకొచ్చి కులగణన చేపట్టడం హర్షనీయమన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల జీవన వైవిధ్య అంశాలను సర్వే ద్వారా తీసుకొని అందరికీ లబ్ధి చేకూరే విధంగా కార్యాచరణ ముందుకు సాగుతుందన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కామారెడ్డి సభలో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు కులగణన చేపట్టడం బీసీలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. ఇటీవల ప్రకటించిన 37 కార్పొరేషన్లలో అధిక సంఖ్యలో బీసీలకు స్థానం కల్పించడం హర్షణీయమన్నారు. కుల సంఘాల ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తున్నందుకు కూడా బీసీలకు ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడం సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నీలకంఠం, మాజీ వైస్ ఎంపీపీ నునుగొండ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సొసైటీ డైరెక్టర్ నాగం గోపికృష్ణ, నాయకులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
