27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉత్తమ ఫలితాలు సాధించిన ఎస్ఆర్ విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జెఈఈ మెయిన్స్ సెషన్-1 ఫలితాలలో నగరంలోని ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించి మంచి పర్సంటెల్ సాధించారు. కళాశాలకు చెందిన మంచిర్ల  శ్రీ రిత్విక్ (99.05 పర్సంటెల్), ఎన్.అక్షద్ (96.23 పర్సంటెల్), ఎం.అభినన్రెడ్డి (95.85 పర్సంటెల్), పాముల సాయిచరణ్ (95.75 పర్సంటెల్), దొంతుల సాయిచరణ్ (95.39 పర్సంటెల్), నవదుర్గ (95.29 పర్సంటెల్), దేవ్పటేల్ (93.84 పర్సంటెల్), ఎం.సాత్వికరెడ్డి (93.47 పర్సంటెల్), రచ్చ అనుష్క (92.45 పర్సంటెల్), ఆసాని రుషికేశ్ (92.12 పర్సం (టెల్) సాధించారు. మొత్తం కళాశాలలకు చెందిన పది మంది విద్యార్థులు 90 శాతంకు పైగా పర్సంటెల్ సాధించినట్లు డీజీఎం గోవర్ధన్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ పర్సంటెల్ సాధించిన విద్యార్థులను అభినందించారు. అనుభవజ్ఞులైన ఎస్ఆర్ అధ్యాపకులు, కరిక్యులమ్, మెటిరియల్స్, ఎగ్జామినేషన్ సిస్టమ్ ద్వారా ఐఐటి ప్రోగ్రామ్స్లో ఫోకస్ బ్యాచ్ వ మరియు స్పార్క్ బ్యాచ్ల ద్వారా విద్యార్థులను జాతీయ స్థాయి పరీక్షలైన నీట్, ఐఐటిలకు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇంచార్జి శ్రీకాంత్, ప్రిన్సిపాల్స్ హన్మంత్రావు, మహిపాల్రెడ్డి, అగేందర్రెడ్డి, మురళి, శ్రీధర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article