- ఓపిఐఎస్ స్టాండింగ్ ఆర్డర్ ను వర్తింపజేయాలి
- ఎస్ఈని కోరిన ఆర్టిజన్లు
ఇందూర్, బతుకమ్మ: సంస్థలో చేరినప్పటి నుంచి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టిజన్లు కోరుతూ ఎస్ఈ రవీందర్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. డిచ్ పల్లి డివిజన్ విభజనలో ఇచ్చిన సీనియారిటీ సరైనది కాదని, దీనికి తామంత అభ్యంతరం తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఆర్టిజన్ కార్మికుల సీనియారిటీని ఆర్టిజన్ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఆర్టిజన్ స్టాండింగ్ ఆర్డర్ అధ్యయనం 8-24(1) ప్రకారం ఓపిఐఎస్ లో మొదటిసారిగా సంస్థలో చేరిన తేదీ (విలీనం కాకముందు ఓపిఐఎస్ నమోదు చేయబడిన తేదీ) నుంచి సీనియార్టీని పరిగణించాలని ఉందనన్నారు. ఆర్టిజన్ స్టాండింగ్ ఆర్డర్ అధ్యయనం 7 ప్రకారం, రెగ్యులైజేషన్ 23 ప్రకారం ఒక డివిజన్ నుంచి మరో డివిజన్ కు గాని, సర్కిల్ నుంచి మరో సర్కిల్ కు గాని శాశ్వతంగా బదిలీ కోరుకున్న వారు సీనియారిటీ జాబితాలో చివరిగా చేర్చబడుతుందన్నారు. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్లలో స్టాండింగ్ ఆర్డర్ కు విరుద్ధంగా సీనియారిటీ తీయడం జరిగిందన్నారు. వాచ్ మెన్ గా ఉన్నవారిని ఆపరేటర్ జాబితాలో, వాచ్మెన్ జాబితాలో ఆపరేటర్ లను పరిగణనాలోకి తీసుకున్నారని, వాటిని సరి చేయాలన్నారు. బదిలీలలో ఇతర సర్కిల్, డివిజన్ నుంచి వచ్చిన వారిని సీనియార్టీ జాబితాలో చాప్టర్ నెంబర్ 7 బి ప్రకారం సీనియార్టీ లో చివరిగా చేర్చాలని గుర్తు చేసారు. 2021-2022 లో ఆర్డర్ ప్రకారం సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని ఆర్టిజన్లను బదిలీలు చేసారని తెలిపారు. ఓపిఐఎస్ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం ఇప్పుడు అదే విధంగా సీనియారిటీని తీసుకోవాలని అర్టిజన్లు కోరుతున్నారు.
