- తెయూ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య టీ. యాదగిరి రావు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : క్రీడలు మానసిక ఒత్తిడిని దూరం చేసి శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెయూ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య టీ.యాదగిరి రావు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ బాడ్మింటన్ మెన్ సెలెక్షన్స్ తెలంగాణ విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్ లర్ ఆచార్య టి.యాదగిరిరావు తన చాంబర్లో క్రీడాకారుల ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఒత్తిడిని దూరం చేసి శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ జి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్లు పూర్తి చేశారని తెలిపారు. ఈ సెలెక్షన్స్ లో ఉమ్మడి జిల్లా నుండీ దాదాపు 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో నుండి క్రీడా నైపుణ్యం కలిగిన 5 మంది ని ఎంపిక చేశారు. నీకేష్, ఉమేష్ (గిరాజ్ కళాశాల), అనిల్,సాయికుమార్ తెలంగాణ యూనివర్సిటీ, రోహన్, ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల కామారెడ్డి లు ఎంపికయ్యారు ఈ ఎంపికైన వర్సిటీ బాడ్మింటన్ టీం చెన్నై లో జరుగు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ లో ఈ నెల 26 నుండి 29వరకు జరుగు టోర్ని లో పాల్గొంటుందని ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి ఆర్ నేత తెలిపారు.