29.3 C
Hyderabad

రతన్ టాటా సంస్మారక సభలో గంగిరెద్దు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలో బుధవారం టాటా ఏ ఐ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఏర్పాటు చేసిన సంస్మారక సభ, అన్నదాన కార్యక్రమంలో ఓ గంగిరెద్దు అందరి దృష్టి ని ఆకట్టుకుంది. ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా తాను ఉన్న సమయంలో సంపాదించిన ఆస్తిలో కొంత భాగం పేద ప్రజల కోసం సమాజ సేవచేస్తూ ఉండేవారు.అలానే ఆయనకు మూగజీవాలంటే కూడా అంతే ప్రేమ ఉండేది. ఇందుకు ఉదాహరణనే తను ఇటీవల మృతి చెందిన సమయంలో తన ఇంట్లో ఉండే శునకం ఆయన ఫోటోలు చూస్తూ అలానే ఉండిపోయినా ఫోటో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాంటి ఘటన శుక్రవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. టాటా స్మారక సభ జరుగుతున్న సమయంలో ఓ గంగిరెద్దు వచ్చింది. దీంతో సభకు హాజరైన వారు గంగిరెద్దును చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

More articles

Latest article