బతుకమ్మ, బోధన్ : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ మధు మలాంచ జూనియర్ కళాశాలలను బుధవారం నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థుల హాజరు తీరును పరిశీలించి ప్రతి విద్యార్థిని కళాశాలకు హాజరైనట్టుగా చూడాలని కళాశాల ప్రిన్సిపాల్ లను ఆదేశించారు రానున్న అర్థ వార్షిక పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేస్తూ సిలబస్ పూర్తి చేయాలని అన్నారు. ప్రయోగశాలను పరిశీలించి వెంటనే ప్రయోగాలను ప్రారంభించాలని ఆదేశించారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయినందున ఆ పనిని త్వరగా పూర్తి చేయాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. కళాశాలలో మంచి వాతావరణం నెలకొల్పే విధంగా మొక్కలను పెంచాలని అన్నారు. అలాగే క్రమం తప్పకుండా కళాశాలలో విద్యార్థుల ప్రతిభలో వెనుకబడిన వారిని మెరుగుపరిచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. కళాశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా కళాశాలల లెక్చరర్లు పాల్గొన్నారు.
