ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఆకస్మిక తనిఖీ
బతుకమ్మ, బోధన్ : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ మధు మలాంచ జూనియర్ కళాశాలలను బుధవారం నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థుల హాజరు తీరును పరిశీలించి ప్రతి విద్యార్థిని కళాశాలకు హాజరైనట్టుగా చూడాలని కళాశాల ప్రిన్సిపాల్ లను ఆదేశించారు రానున్న అర్థ వార్షిక పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేస్తూ సిలబస్ పూర్తి చేయాలని అన్నారు. ప్రయోగశాలను పరిశీలించి వెంటనే ప్రయోగాలను ప్రారంభించాలని ఆదేశించారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయినందున ఆ...