సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

0 1,078

బతుకమ్మ,ఏర్గట్ల: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఏర్గట్ల మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి టపాకాయలు కాలుస్తూ ఎంతో ఉత్సాహంతో సంబరాలు చేసుకొని ఒకరికొకరు కార్యకర్తలు సీనియర్ నాయకులు మిఠాయిలు తినిపించుకున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్,లు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన సోనియమ్మ, నిండు నూరేళ్లు భగవంతుని ఆశీస్సులు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, గంగా ప్రసాద్, గడ్డం జీవన్ రెడ్డి, జింక అనిల్, రేండ్ల రమేష్ ముదిరాజ్ ,బద్దం లింగారెడ్డి, బెజ్జారం భాను, గుమ్మి ర్యాల చిన్న సంజీవ్ యాదవ్, ముస్క మోహన్ రెడ్డి, పన్నాల నర్సారెడ్డి, సున్నపు ఇస్తారి, కూరాకుల బోర్రన్న, రోక్కెడ చిన్న సాయిలు, ఎండి మునీర్, మండల పరిధిలో గల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.