మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, బతుకమ్మ : మాటల వేట సీఎందే కానీ.. సీఎస్ అధికారులు బలవుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి సైన్యంలా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇష్టానుసారం కేసులు పెట్టిన వారిపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేటు ముఠాలా పని చేస్తున్న పోలీసులు ఉచలు లెక్కించాల్సిందేనని హెచ్చరించారు. ఐఏఎస్, అటవీ అధికారుల వంతైందని, ఇతర అధికారులూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు ఎండగట్టిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆత్మాభిమానం ఉన్న ఏ సీఎం అయితే రాజీనామా చేసేవారు
కంచె భూముల వ్యవహారం కేసులో సుప్రీంకోర్టు వాదోపవాదనలు విన్న తర్వాత సామాన్యుడికి న్యాయస్థానాల మీద గౌరవం పెరిగిందన్నారు. ఆత్మాభిమానం ఉన్న ఏ సీఎం అయినా రాజీనామా చేసేవారని, కానీ సీఎం రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానం లేదన్నారు. ఇది పర్యావరణ ప్రేమికుల విజయమన్నారు.. మేం గత వారం రోజులుగా ఏం చెప్పామో, సెంట్రల్ కమిటీ అదే చెప్పిందన్నారు. కేంద్రప్రభుత్వం దర్యాప్తు చేయాలి.. దర్యాప్తు సంస్థలు మీ చేతుల్లోనే ఉన్నాయన్నారు. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పిన తర్వాత కేంద్రప్రభుత్వం ఎందుకు వెనక్కి పోతుందన్నారు. కేంద్ర కమిటీ రిపోర్ట్ తర్వాత ఏం చేస్తారో బీజేపీ నేతలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
