బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లాబిచ్కుంద మండల సమాఖ్యలో మండల సమాఖ్య అధ్యక్షురాలు అధ్యక్షతన సోషల్ మొబిలైజేషన్ మరియు నూతన సంఘాల ఏర్పాటు పై వివో, ఓబి,లకు వివో ఏలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి డీపీఎం ఫామ్ సాయిలు హాజరై సంఘాల ఏర్పాటు పై అవగాహనా కల్పించడం జరిగింది. మహిళా సంఘాల లో లేని మహిళలను(18 -60ఏళ్ల లోపు) గుర్తించి సంఘాలలో చేర్పించండం, వృద్ధ (60ఏళ్ల పైబడి) మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం, విభిన్న ప్రతిభవంతుల (వికలాంగులు) ల సంఘాలు ఏర్పాటు చేయడం, కిషోర బాలికల (15-18ఏళ్ల లోపు) సంఘాలు ఏర్పాటు చేయడం పై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో డీపీఎం సాయులు సర్, ఏపీఎం రవీందర్, సీసీ లు, 38గ్రామ సంఘాల అధ్యక్షులు, 38 గ్రామ సంఘాల వివో ఏ లు హాజరయ్యారు.