27.1 C
Hyderabad

గ్రామాలలో చర్మవ్యాధుల పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు:  భిక్కనూరు మండలంలోని అన్ని  గ్రామాలలో గురువారం ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరుగుతూ చర్మం పై కొత్తగా ఏర్పడిన మచ్చలు పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మెడికల్ అధికారి యేమిమా మాట్లాడుతూ అనుమానాస్పద కుష్టు వ్యాధిగ్రస్తులను, ఇతర చర్మవ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి చికిత్స చేయడం జరుగుతుందని, 15 రోజులలో మండలంలో పూర్తి సర్వే ఆశా కార్యకర్తలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చర్మగాదిగ్రస్తులు, ఇతర ఇబ్బందులు పడుతున్న వారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి దివ్య, హెచ్ ఈ ఓ వెంకటరమణ, వైద్య సిబ్బంది సతీష్, ఆశా కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

More articles

Latest article