25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

భారత సేవారత్న అవార్డుకు శివకుమార్ ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

  • మనం బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించిన శివ

 

హైదరాబాద్, బతుకమ్మ : మేము సైతం మీకోసం ఫౌండేషన్ ను స్థాపించి ఈ ఫౌండేషన్ ద్వారా ఎవరికి ఎప్పుడు రక్తం అవసరమైన తాను 18 సార్లు రక్త దానం చేసి, తన ఫౌండేషన్ సభ్యుల ద్వారా 1500 మందికి రక్తం ఇప్పించి, 69 అన్నధాన కార్యక్రమాలు నిర్వహించి అన్నార్థుల ఆకలి తీర్చిన కట్టబోయిన శివకుమార్ యాదవ్ 2024 భారతసేవారత్న అవార్డుకు ఎంపికయ్యారు.హైద్రాబాద్ పట్టణానికి చెందిన శివ కుమార్ పట్టణంలో ఏ ప్రాంతంలోనైనా, ఎవరికైన రక్తం అవసరమైతే గంట వ్యవధిలో తన గ్రూప్ మిత్రుల సహకారంతో రక్తాన్ని సమాకూర్చిన సామాజిక కార్యకర్త గా, ప్రతి వారం ఆకలితో అలమటించే అన్నర్థులకు అన్నదానం చేసిన అన్నదాతగా 2024 నేషనల్ బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డును శివకుమార్ అందుకున్నారు. అంతే కాకుండా తన  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సైనిక్ గ్రూప్ ఫౌండర్ గా ఉన్న శివకుమార్ తన సైనిక్ వాట్సాప్ గ్రూప్ ద్వారా 8000 మందికి పైగా ఆసక్తి గల అభ్యర్థులకు ఆర్మీ, ఎస్సీసిజీడీ, స్టేట్ పోలీస్ జాబ్ లకు ప్రిపేర్ అయ్యే వారికి ఉచితంగా శిక్షణను అందించి మనం ఫౌండేషన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాధించారు. నల్గొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండలం బోయ గూడెం కు చెందిన శివకుమార్ ఈ సైనిక్ గ్రూపును ప్రారంభించి ఈ గ్రూప్ ద్వారా శిక్షణ పొందిన వారిలో ఇప్పటికి 175 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. ఇటీవలే జిల్లా నుండి ఆరుగురు ఆర్మీకి ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. తనతో పాటుగా తన సామజిక సేవలో సహకారం అందించి, పాలు పంచుకొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.వచ్చే నెల 11న రాజధానిలోని త్యాగరాజా గాన సభలోతనకు గౌరవ డాక్టరెట్ ను మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

More articles

Latest article