రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నాలుగవ రోజు అమ్మవారు శ్రీ సంతోషిమాత దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్బంగా అమ్మవారికి వేద పండితులు, దుర్గామాత మాలధారణ వేసిన స్వాములు భక్తిశ్రద్ధలతో అభిషేకం, అలంకరణ, కుంకుమార్చన, మహా మంగళహారతి పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో దుర్గామాత కమిటీ నిర్వాహకులు, దుర్గామాత మాలదారణ స్వాములు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
