26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఆటో కార్మికులపై ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఉమ్మడి జిల్లా కన్వీనర్ కటారి రాములు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పెరిగిన డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో కార్మికులపై ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధించడం వల్ల వారి జీవనం మరింత కష్టంగా మారిందని యూటీయూసీ జిల్లా కన్వీనర్ కటారి రాములు అన్నారు. జిల్లా కేంద్రంలోని నాందేవాడలో ఉన్న ఆర్‌ఎస్‌పీ పార్టీ కార్యాలయంలో యునైటెడ్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే రోజు వేర్వేరు కూడళ్లలో ఫొటోలు తీసి రూ.1,200 నుంచి రూ.1,500 వరకు జరిమానాలు విధిస్తున్నారని ఆరోపించారు. మహాలక్ష్మి పథకం అమలుతో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో పాటు ట్రాఫిక్ ఫైన్‌ల భారం కూడా ఆటో డ్రైవర్లపై పడుతోందని పేర్కొన్నారు. ఆటో కార్మికులపై అనవసర వేధింపులు నిలిపివేసి, జరిమానాల విషయంలో ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్, ముజీబ్, పండరి, సయ్యద్ రఫీ ఉదిన్, మమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అనీస్, విటల్, ఇమ్రాన్ ఖాన్, జావిద్, షకీల్, ముబీన్, రైమద్ అలీ, మైమూద్, అశ్వక్, సయ్యద్ అజ్జు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article