విధుల్లో చేరిననాటి సీనియారిటీని తీసుకోవాలి
ఓపిఐఎస్ స్టాండింగ్ ఆర్డర్ ను వర్తింపజేయాలి ఎస్ఈని కోరిన ఆర్టిజన్లు ఇందూర్, బతుకమ్మ: సంస్థలో చేరినప్పటి నుంచి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టిజన్లు కోరుతూ ఎస్ఈ రవీందర్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. డిచ్ పల్లి డివిజన్ విభజనలో ఇచ్చిన సీనియారిటీ సరైనది కాదని, దీనికి తామంత అభ్యంతరం తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఆర్టిజన్ కార్మికుల సీనియారిటీని ఆర్టిజన్ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఆర్టిజన్ స్టాండింగ్ ఆర్డర్ అధ్యయనం 8-24(1) ప్రకారం ఓపిఐఎస్ లో మొదటిసారిగా సంస్థలో చేరిన...