నిజామాబాద్, బతుకమ్మ :
సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే 194వ జయంతి వేడుకలు అంబేద్కర్ కాలనీ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయిపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడుతూ కేవలం బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా అగ్ర వర్ణాల నిరుపేదలకు కూడ తాను స్థాపించిన పాఠశాలలో దాదాపు 165 సంవత్సరాల క్రిందటే చదువు నేర్పిన గొప్ప దార్శనికురాలు సావిత్రి బాయి ఫూలే అని అన్నారు.తమ జీవిత కాలంలో దాదాపు 52 పాఠశాలలు స్థాపించి సామాజ అభ్యున్నతి కొరకు పని చేసిన నిస్వార్థ నారీ శిరోమణి సావిత్రి బాయి పూలే అని జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, పోల్కం గంగాకిషన్. వాసం జయ, కొయ్యాడ శంకర్, సిలివేణి సంతోష్, మహేష్, రుక్మిణి, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు
