మహిళా హక్కుల కొరకు నినదించిన గళం సావిత్రి బాయి పూలే
నిజామాబాద్, బతుకమ్మ : సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే 194వ జయంతి వేడుకలు అంబేద్కర్ కాలనీ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయిపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడుతూ కేవలం బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా అగ్ర వర్ణాల నిరుపేదలకు...