నిజామాబాద్, బతుకమ్మ :
మన భారతీయ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే జన్మదినం సందర్బంగా పీఆర్ టియూ తెలంగాణ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృపాల్ సింగ్ సోడి, కనకపురం రవీందర్ లు పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ సావిత్రి బాయి జయంతి ని మన రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించినందు కు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అణిచివేయబడిన వర్గాలను న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని అర్పించారని కొనియాడారు. ఆమె చేసిన పోరాటం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని తెలిపారు. అనంతరం కనకపురం రవీందర్ మాట్లాడుతూ విద్య తోనే వనిత కి విముక్తి సాధ్యమన్న సామజిక సంస్కార్త, భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సమాజం లో మార్పునకు పునాది వేసిన ఘనత సావిత్రి భాయి పూలే గారిది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్, నాగేశ్వర్రావు, జావీద్, సందీప్, దిలీప్, మాక్సూద్ , మాహిళా ఉపాధ్యాయురాల్లు జ్యోత్స్న, సుచిత్ర, వింధ్య తాయి,సావిత్రి అర్షియా ఫిర్దోస్ లు పాల్గొన్నారు.
