24.1 C
Hyderabad
Monday, August 3, 2026

శ్రీసరస్వతి విద్యా మందిర్ లో సప్తశక్తి సంఘం

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ యోజనలో శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలోబుధవారం  సప్తశక్తి సంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ వారి ఆదేశాల ప్రకారం పాఠశాలలో నర్సరీ నుండి ఒకటో తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క 120 మాతృమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, ఈ సందర్బంగా వక్తగా హాజరైనటువంటి పరళీ కృష్ణవేణి  పంచ పరివర్తినాలైన అంశాలపై  1. కుటుంబ ప్రబోధన్. 2. పర్యావరణ పరిరక్షణ. 3. సామాజిక సమరసత.4. స్వదేశీ భావాన్ని పెంపొందించడం.5. పౌర విధులపై అవగాహన కల్పించారు.ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి బద్రి జలజ మాట్లాడుతూ భారతదేశ ఉన్నతిలో మహిళల యొక్క పాత్రను వివరించారు.  పాఠశాల అధ్యక్షులు డాక్టర్ శ్రీ జి బసంత్ రెడ్డి  మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో పిల్లలను పెంచడంలో మహిళల యొక్క పాత్రను క్లుప్తంగా వివరించారు.అనంతరం పరలి కృష్ణవేణి,ముఖ్య అతిథి జలజ, సంయోజక్ ముష్కం వెన్నెల,  సహ సంయోజక్ బొమ్మకంటి లయలను పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి.బసంత్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మాతాజీలు డి.స్రవంతి, పి. మంజుల, జె. శాలిని, ఎస్.భారతి, ఎం. శ్రీజ, బి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article