- రైతులకు తప్పని ఇక్కట్లు
బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని అంతంపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఫార్మా కంపెనీలు, ఐరన్ ఫ్యాక్టరీ, రైస్ మిల్లు, ఆయిల్ ఫ్యాక్టరీఉండడంతో రైతులకు వెళ్లే రహదారి పూర్తిగా ప్రమాదకరంగా మారాయి. రైతులు మాట్లాడుతూ పంట పొలాలకు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిని గొతులు మాయంగా మారిన నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ విషయంపై అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆయ గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని రోడ్డు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

