నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఏప్రిల్ 9న ఐఆర్సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్రారంభమవుతుందని టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డిఎస్జీపీ కిశోర్ తెలిపారు. ఏడు జ్యోతిర్లింగ దర్శన యాత్ర సికింద్రాబాద్ ఐఆర్సిటిసి ప్రత్యేక టూరిస్ట్ ప్యాకేజీ తో భారత్ గౌరవ్ ప్రత్యేక టూరిస్ట్ రైలు ప్రారంభమవుతుందని అన్నారు. ఏప్రిల్ 9న ఐఆర్సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర సికింద్రాబాద్, నిజామాబాదు , మీదుగా ఉజ్జయినికెళ్తుందని తెలిపారు. ఏప్రిల్ 9 ఉదయం 7గంటలకు నిజామాబాదు రైల్వే స్టెషన్ లో ఆగుతుందన్నారు. ఏడు జ్యోతిర్లింగాల దర్శనాలు ఉంటాయన్నారు. ఉజ్జయిని, మహాకాళేశ్వర్, ద్వారకా నాగేశ్వర్,సోమనాథ్, భీమశంకర్, త్రయంబకేశ్వర్, గృశ్నేశ్వర్,జ్యోతిర్లింగాలను సందర్శన చేస్తారని తెలిపారు. ఈ యాత్రలో అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, రవాణా హోటల్ గదులతో కలిపి, ట్రావెల్ ఇన్సూరెన్స్ తో పాటు, ప్రతి కోచ్ లో సెక్యూరిటీ గార్డ్, టూర్ గైడ్ అందుబాటులో ఉంటారని తెలిపారు. కన్ఫామ్ బెర్తులతో టికెట్ ప్రారంభ ధర ₹ 20980/- ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని నిజామాబాద్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు www.irctctourism.com గాని లేదా 9701360701, 9281030711, 9281030712 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు.
