30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ జరిపించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బుద్ద మహావిహార్ బుద్ధిస్టులకే చెందాలి

 

ఆర్మూర్ బతుకమ్మ: ప్రఖ్యాత క్రైస్తవ పాస్టర్ పగడాల ప్రవీణ్  అనుమానాస్పద మృతిపై సిబిఐ ద్వారా దర్యాఫ్తు జర్పాలని, అదేవిధంగా బీహార్ రాష్ట్రంలోని “మహాబోధి బుద్ద మహవిహార్” మనువాదుల కబంధ హస్తాల్లో ఉంది. అది దేశ బుద్ధిస్టులకే చెందాలని ప్రభుత్వ అధికారులకు వినతి పత్రం అందజేశారు. శుక్రవారం అంబేడ్కర్ యువజన సంఘం (ఏవైఎస్) ఆధ్వర్యంలో ఆర్మూర్ మండల రెవెన్యూ ఆఫీసర్, అనంతరం అర్.డి.ఓ ను ఆఫీస్ కి వెళ్లి కల్సి ఈ పత్రాలు సంబధిత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వపు శాఖలకు అందజేయగలరని విజ్ఞప్తి చేశారు. ఇందులో చర్చి పాస్టర్స్, అంబేడ్కరైట్లచే సంతకాలు చేసి అందజేశామని ఏవైఎస్ జిల్లా అధ్యక్షులు ఇత్వార్పేట్ లింగన్న తెల్పారు. ఈ సందర్భంగా హొరేబు చర్చి ఆర్మూర్ పాస్టర్ సుద్దపల్లి మార్కు మాట్లాడుతూ దైవసేవకుడు ప్రవీణ్ పై మతోన్మాదులు కావాలని కుట్రపన్ని హత్య చేశారని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగం ఉండగా మనువాదులు తమ ఇష్టరాజ్యం కొనసాగించడం సరైంది కాదని హెచ్చరించారు. సీబీఐ ద్వారా తక్షణమే విచారణ జరిపించి, దుండగులను కఠినంగా శిక్షించాలని మార్కు డిమాండ్ చేశారు. బహుజన సమాజ్ పార్టీ నేత మార్ల ప్రభాకర్ మాట్లాడుతూ బుద్ద మహావిహార్ తమ బుద్ధిస్టులకే చెందాలని, బుద్ధిష్ట్ ఆందోళనకారుల పై విధించిన అక్రమ కేసుల్ని వెంటనే తొలగించాలని కేంద్ర – బీహార్ సర్కార్లను ఆయన కోరారు. ఇందులో జిజస్ పెంథికొస్తల్ చర్చికి చెందిన చిన్నచెవ్వ డేవిడ్, జాంభవ చమార్, బుద్ధిష్ట్ సొసైటీ ఆర్మూర్ అధ్యక్షులు రాజు జాదవ్, డి.కైలాస్, సురేష్ వాగ్మారే, మాసం కాపు రాజయ్య, మూలనివాసి మాలజీ ఉన్నారు.

 

More articles

Latest article