27.3 C
Hyderabad

రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో  సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున పురాతన రైస్ మిల్ గోడకూలి రైస్ మిల్ ప్రక్కన గల ఇంటిపై పడడంతో ఆ ఇంటిలో నిద్రిస్తున్న ముగ్గురిలో మహేష్, రెండు నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా మహేష్ భార్య మహేశ్వరి స్థానికుల సహాయంతో గాయాలతో బయటపడింది. పాత గోడను తొలగించడంపై నిర్లక్ష్యం చేసిన రైస్ మిల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని మహేశ్వరికి కుటుబానికి ప్రభుత్వం రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించడంతోపాటు, ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ జిల్లా కౌన్సిల్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ నగర కార్యదర్శి వై.ఓమయ్య, సాయమ్మ, భూలక్ష్మి, కౌసల్య, లింగవ్వ,పుష్ప, కిష్టయ్య,సిర్పూర్ సాయిలు,శంకర్ పాల్గొన్నారు.

More articles

Latest article