- ఎఫ్ ఎఫ్ సీ రిపోర్టులో సంచలన విషయాలు
- పరారీలో ఉన్న రియాజ్ సీసీఎస్ పోలీసులతో ఎందుకు టచ్ లో ఉన్నాడు
- అసీఫ్ ఫేక్ కరెన్సీ గ్యాంగ్ సభ్యుడా..?
- కానిస్టేబుల్ మర్డర్ జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ పుటేజీలు ఎక్కడ..?
- రియాజ్ ఎన్ కౌంటర్ పై సీబీఐ విచారణ జరుపాలని డిమాండ్
హైదరాబాద్, బతుకమ్మ : గత నెల దీపావళి రోజున జరిగిన రౌడీషీటర్ రియాజ్ ది ఫేక్ ఎన్ కౌంటర్ అని, అతడు పోలీస్ కస్టడిలో చనిపోతే ఎన్ కౌంటర్ అని పోలీసులు కట్టు కథ అల్లారని ఫ్యాక్ట్ పైండింగ్ కమిటీ సంచలన విషయాలు వెల్లడించింది. ఎఫ్ ఎఫ్ సీ సభ్యులు ఖలిధా పర్వీన్, సారా మ్యాధ్యూస్, మాజీద్ ఘట్టారీ, అడ్వకేట్ సమీర్ ఆలీ, మహ్మద్ అబ్దుల్లా తాజ్, షేక్ సికంధర్ లు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వారు నిజామాబాద్ లో పదిరోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికను రుపొందించి వాటిని మీడియా ముందుంచారు. రిపోర్టులో తెలిపినట్లుగా యధాతథంగా. . . .
నిజామాబాద్ పోలీసులు చెబుతున్నట్లుగా రియాజ్ పరారీలో లేడని, ప్రైవేట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ గా పని చేస్తున్నాడని అతనికి ముందు నుంచే ఆసీఫ్ తో పరిచయం ఉంది. రియాజ్ ఆసీఫ్ కు చెందిన స్కూటీ ని రికవరీ ఏజెంట్ గా సీజ్ చేశాడు. అయితే ఆ సమయంలో రూ.3లక్షల నకిలీ కరెన్సీ, బైక్ లు దొరకగా వాటిని అతను సొంతానికి వాడుకున్నాడు. ఆన్ లైన్ లో చేసిన అప్పులు తీర్చి బైక్ ను కొన్నాడు. ఒక రోజు ఆసీఫ్ వచ్చి రూ.3 లక్షలు, బైక్ ఇవ్వకపోతే కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడు. దానితో రియాజ్ కేసుల పరంగా తనకు టచ్ లో ఉన్న సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఫేక్ కరెన్సీ ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించారు. మరి స్కూటీని జప్తు చేయకపోవడం ఈ ఘటనలో గాయపడిన ఆసీఫ్ ను హీరో చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు.
కానిస్టేబుల్ ప్రమోద్ విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ కు వెళ్లి రాగానే అతనికి వెంటనే రౌడీషీటర్ రియాజ్ ను పట్టుకు వచ్చే బాధ్యతను ఏ అధికారి అప్పజెప్పారనే దానికి సమాదానం లేదు. ప్రమోద్ తో పాటు మరో ఇద్దరు ఎస్సైలు రియాజ్ ను పట్టుకునేందుకు వెళ్లగా అతడిని సీసీఎస్ స్టేషన్ కు తరలిస్తుండగానే మార్గమధ్యలో ప్రమోద్ ను కత్తితో పొడిచి పరారీ అయ్యారని పోలీసులు చెబుతుండగా అక్కడ సీసీటీవీ పుటేజీలు ఎందుకు లేవని ఎఫ్ఎఫ్ సీ ప్రశ్నలు లేవనేత్తింది. రియాజ్ ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల వద్ద ఆయుధాలు లేవా? అంతకుముందే పోలీసు అధికారులు ప్లాన్ ప్రకారమే కానిస్టేబుల్ మర్డర్ కేసును రియాజ్ పైకి తోసేందుకు ప్రయత్నించారని రిపోర్టులో పేర్కొన్నారు.
పోలీసులు చెబుతున్నట్టుగా రియాజ్ ను పట్టుకునే క్రమంలో అసీఫ్ పై రియాజ్ కత్తితో దాడి చేయలేదని తెలిపారు. అసీఫ్ గ్యాంగ్ రియాజ్ పోలీసులకు ఇన్ పార్మర్ గా మారాడని అతన్ని హత్య చేసేందుకు ప్రయత్నంలో మధ్యవర్తిగా వచ్చిన కానిస్టెబుల్ ప్రమోద్ చనిపోయాడని పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తులోనూ ఎక్కడ సీసీ టీవీపుటేజీలో ప్రమోద్ కు సంబంధించిన వీడియోలు ఎందుకు లేవని ఎక్కడో ఘటన జరిగితే వినాయక్ నగర్ లో కానిస్టేబుల్ డేడ్ బాడిని పారేసి రియాజ్ ను హంతకుడిని చేశారని వారు తెలిపారు.
కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోయిన రోజు తరువాత నుంచి రియాజ్ కుటుంబ సభ్యులను పోలీసులు వేధించారని తెలిపారు. అతని తల్లి, భార్యతో పాటు పిల్లలను రియాజ్ ఆచూకి కోసం వేధింపులకు పాల్పడ్డారని అప్పుడే 19న రియాజ్ పోలీసులకు లొగిపోయాడని తెలిపారు. రియాజ్ ను ప్రమోద్ ను హత్య చేసినట్టు ఒప్పుకోవాలని టార్చర్ చేయడంతో కస్టడిలో చనిపోయారని అన్నారు. రియాజ్ ను ఆసుపత్రికి తరలించి ఎన్ కౌంటర్ లో చనిపోయాడని పోలీసులు ప్రకటించారని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్టులో పేర్కొంది. రియాజ్ ఎన్ కౌంటర్ బూటకం అని దానిపై సీబీఐ విచారణ జరుపాలని డిమాండ్ చేశారు.

