29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఫుడ్ పాయిజన్ పాపం ప్రభుత్వానిదే

Must read

📰 Generate e-Paper Clip

  • 52 మంది విద్యార్థులు అస్వస్థతపై రవి గౌడ్ ఆగ్రహం

 

సిరిసిల్ల, బతుకమ్మ: గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ధర్మవరం బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ పాపం ప్రభుత్వానిదేనని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. ఈ ఘటనపై నిరసనగా శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఘోరమని  కంచర్ల రవి గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచినా విద్యార్థుల సంక్షేమంపై ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుండి  110 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం సమీక్షలు చేయకపోవడం సిగ్గుచేటు” అని ఆయన అన్నారు.హాస్టళ్లలో చదివే విద్యార్థులు ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారని, వారి తల్లిదండ్రులు ఆశతో పంపిస్తే పిల్లల ప్రాణాలపై ఇలాంటి నిర్లక్ష్యం చూపడం దారుణమని ఆయన విమర్శించారు. హాస్టల్‌లలో జరుగుతున్న వ్యవస్థలపై విచారణ జరిపి, బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.“కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు శాపంగా మారిందని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనీ, హాస్టల్‌ల పరిస్థితిని ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించాలని” రవి గౌడ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్‌.కె. అప్రోచ్, హరీష్, సాయి, ఆదిత్య, రామ్, వరుణ్, జస్వంత్, అనీష్, సాయి తేజ, విష్ణు, రిశ్విత్, అభినయ్, విక్రం, సిద్ధార్థ శ్రీశేషం, లవన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article