25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

యూత్ ఇన్ పాలిటిక్స్ పై రౌండ్ టేబుల్ సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

  • భారీ సంఖ్యలో పాల్గొన్న యువత

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి మణికంఠ గార్డెన్స్ లో “యూత్ ఇన్ పాలిటిక్స్ ” అనే అంశంపై ప్రముఖ యువ న్యాయవాది కొండాపురం వెంకట్ రెడ్డి,బీజేపీ యువ నాయకుడు మారవేణి రంజిత్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నుండి యువ నాయకులు, పార్టీలకు అతీతంగా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి యువ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా  బుర్ర రవితేజ గౌడ్, నరేష్ నాయక్  మాట్లాడుతూ  యూత్ ఇన్ పాలిటిక్స్ ముఖ్య ఉద్దేశాన్ని రాజకీయాల్లో యువత పాత్ర ఏ విధంగా ఉండబోతుందని వివరించారు.ప్రతి గ్రామంలో ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలని యువతతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.అనంతరం యువత వారి వారి అభిప్రాయాలను తెలిపారు.ఈ కార్యక్రమంలో బానోత్ తిరుపతి నాయక్,సింగారం దేవరాజు,ప్రమోద్,చల్ల మధు,బి.  ప్రవీణ్,లంబ కుమార్,చిందు శ్రీనివాస్,ఆర్.సాయితేజ,జితేందర్ రెడ్డి,దయాకర్ రెడ్డి,బత్తుల అరవింద్,బేతి రాము,క్రాంతి కుమార్,శేఖర్,రాజు రెడ్డి,చరణ్ గౌడ్,సాయి ప్రేమ్,ఎల్లం యాదవ్,  కొండా సాయి,పొన్నాల  వెంకటేష్,  ముత్యాల దీపక్, వివిధ పార్టీల నాయకులు,యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Roundtable meeting on Youth in Politics

More articles

Latest article