. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
భూగర్భ జలాలను పెంపొందించేలా సమీకృత కార్యాలయాల సముదాయంలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ లను నిర్మించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో గల జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ భవనంలోని రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. దీని నిర్మాణం వల్ల ఏమేరకు భూగర్భ జలాలు వృద్ధి చెందాయి, నిర్మాణానికి అయిన వ్యయం ఎంత తదితర వివరాలను ఆరా తీశారు.

ఇదే తరహాలో ఐ.డీ.ఓ.సీలోనూ అనుకూలమైన చోట రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ తరహా వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల వల్ల వర్షపు జలాలు వృధా కాకుండా భూగర్భ జలాలు ఎంతో వృద్ధి చెందుతాయని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సాయాగౌడ్ తదితరులు ఉన్నారు.

